తెరాసతో పోరాటానికి రాములమ్మ సై!

March 04, 2019


img

రాష్ట్ర కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారరధసారధి విజయశాంతి తెరాసపై పోరాటానికి సమరశంఖం పూరించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు (పినపాక), ఆత్రం సక్కు(ఆసిఫాబాద్)లను తెరాసలో చేర్చుకోవడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. పార్టీ మారిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తక్షణం తమ పదవులకు రాజీనామాలు చేయాలని లేకుంటే స్పీకరు వారిపై అనర్హత వేటు వేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజ్యాంగబద్దంగా నడుచుకొని చట్ట ప్రకారం వారిరువురిపై అనర్హత వేటు వేస్తారని ఆశిస్తున్నామని విజయశాంతి అన్నారు. ఒకవేళ ఆవిధంగా జరుగకపోతే ఈ ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి తెరాసను ఎండగడతామని హెచ్చరించారు. ఎల్లుండి అంటే బుదవారం పినపాకలో, ఆసిఫాబాద్ నియోజకవర్గాలలో ధర్నాలు, నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. మళ్ళీ శుక్రవారం ఆ రెండు నియోజకవర్గాలలో సీఎల్పీ అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈసారి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకొనే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. 



Related Post