ఆ కేసుకు ముగింపు ఎప్పుడో?

February 25, 2019


img

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయి ఇద్దరూ మాజీలైనప్పటికీ, గత ప్రభుత్వంలో వారి  శాసనసభ్యత్వ రద్దు కేసు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉండటం విశేషం. ఆ కేసులో మొదట వారు హైకోర్టులోని సింగిల్ జడ్జి కోర్టును ఆశ్రయించగా వారిరువురి సభ్యత్వాలను పునరుద్దరించమని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ మాజీ స్పీకర్ మధుసూధనాచారి, అసెంబ్లీ కార్యదర్శి కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో వారిరువూరు మళ్ళీ సింగిల్ జడ్జి కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకుండా కోర్టుధిక్కారనేరానికి పాల్పడినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారిరువురూ పిటిషన్ వేయగా దానిని విచారణకు స్వీకరించిన సింగిల్ జడ్జి కోర్టు అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శిలకు నోటీసులు పంపింది. 

దానిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచిని ఆశ్రయించగా, సింగిల్ జడ్జి కోర్టులో జరుగుతున్న కోర్టు ధిక్కారనేరంపై విచారణను నిలిపివేస్తూ స్టే విధించింది. దీంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ల కేసు మళ్ళీ మొదటికి వచ్చినట్లయింది. ఇంకా ఈకేసు ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు కానీ చివరికి వారిరువురి శాసనసభ్యత్వాలు రద్దు చేయడం తప్పు అని హైకోర్టు తీర్పు చెపితే ఏమవుతుందో!


Related Post