చైనా మాట మీద నిలబడుతుందా?

February 22, 2019


img

పాకిస్థాన్‌లో ఉంటూ భారత్‌పై ఉగ్రదాడులు జరిపిస్తున్న జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్‌కు రోజులు దగ్గర పడినట్లే ఉన్నాయి. న్యూయార్కులో గురువారం జరిగిన ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) సమావేశంలో పుల్వామా ఉగ్రదాడిపై చర్చించి జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సహా అన్ని ఉగ్రవాద సంస్థలను కట్టడి చేయవలసి ఉందని, అందుకు భారత్‌కు పాకిస్థాన్‌తో సహా అన్ని దేశాలు సహకరించాలని ఒక తీర్మానం చేసి సభ్యదేశాలు ఆమోదం తెలిపాయి.

విశేషమేమిటంటే, ఇంతవరకు మసూద్ అజర్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చకుండా అడ్డుపడుతున్న చైనా కూడా ఈ తీర్మానానికి మద్దతు పలికింది. ఒకవేళ చైనా ఈ మాటకు కట్టుబడి ఉంటే, అప్పుడు పాకిస్థాన్‌ అతనిపై చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అంతర్జాతీయ సమాజం ఒత్తిడికి తలొగ్గి చైనా, పాక్‌లు అక్కడ బుర్ర ఊపి వచ్చినప్పటికీ అతనిపై చర్యలు తీసుకొంటాయని ఆశించడం అత్యాసే అవుతుంది. ఒకవేళ అతనిపై చర్యలు తీసుకోవలసిన పరిస్థితులే వస్తే అతనిని వెంటనే దేశం దాటించడం ఖాయం. కనుక భారత్‌కు తలనొప్పిగా మారిన మసూద్ అజర్‌ను భారత భద్రతాదళాలే ఏదో విధంగా మట్టుబెట్టాల్సి ఉంటుంది. 


Related Post