పుల్వామా రాజకీయాలు షురూ

February 18, 2019


img

పుల్వామా దాడి జరిగినప్పుడు దేశంలో అన్ని పార్టీలు కేంద్రానికి బాసటగా నిలిచి ముక్తకంఠంతో ఆ దాడిని ఖండించాయి. మూడు రోజులయ్యేసరికి ఆ వేడి తగ్గడంతో ఆ దురదృష్టకర ఘటనపై రాజకీయాలు మొదలైపోయాయి. 

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ, “ఇది ఖచ్చితంగా మోడీ ప్రభుత్వ వైఫల్యమే. నిఘా వర్గాల హెచ్చరికలు పట్టించుకోకుండా...ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా గతంలో ఉగ్రవాదుల దాడులు జరిగిన మార్గం గుండా భద్రతాదళాలను ఎందుకు వెళ్ళనిచ్చారు? అసలు ఇటువంటి దాడులు జరుగకుండా ఈ ఐదేళ్ళలో పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని ఎందుకు కట్టడి చేయలేదు? ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక మోడీ ప్రభుత్వం పాక్ పై ప్రతీకార చర్య అంటూ హడావుడి చేస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందే ఈ ఉగ్రవాద దాడి జరుగడం అనుమానాలకు తావిస్తోంది,” అని అన్నారు. 

దేశం నలుమూలల వేలాదిమంది సైనికులు మోహరించి ఉంటారు. వారి కదలికలను ప్రధాని నరేంద్రమోడీ నియంత్రించరనే చిన్న విషయం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తెలియదనుకోలేము. ఒక నరహంతకుల ముఠా ఆత్మహుతిదాడి చేసి 43 మంది సైనికులను బలి తీసుకొంటే ఏ ముఖ్యమంత్రి అయినా విచారం వ్యక్తం చేస్తారు కానీ మమతా బెనర్జీ ఇంత నీచంగా మాట్లాడటం విస్మయం కలిగిస్తుంది. ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్నవారిలో మమతా బెనర్జీ కూడా ఒకరు. ఒకవేళ ఆమె ప్రధానమంత్రి అయితే ఇంకేవిధంగా మాట్లాడుతారో... ఏవిధంగా వ్యవహరిస్తారో?


Related Post