రిటైర్ అయ్యాక తెరాసలో చేరుతారేమో?

January 28, 2019


img

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ వైఖరి పట్ల రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ఏపీ సిఎం చంద్రబాబునాయుడుతో సహా తెలుగుదేశం పార్టీ నేతలు తరచూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ కోశాధికారి జి నారాయణరెడ్డి గవర్నర్‌ నరసింహన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

“రాజ్యాంగబద్దహోదాలో ఉన్న గవర్నర్‌ నరసింహన్‌ పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి కానీ ఆయన ఓ తెరాస నాయకుడిలాగ వ్యవహరిస్తున్నారు. ఆయన రాజ్‌భవన్‌కు కాక తెరాసకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు మాట్లాడుతున్నారు.

గణతంత్రదినోత్సవం సందర్భంగా ఆయన చేసిన ప్రసంగలో కేసీఆర్‌ను ఏదోవిధంగా ప్రసన్నం చేసుకొని తన పదవీకాలం పొడిగించుకోవాలనే ఆరాటపడుతున్నట్లున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచి పనులను తప్పకుండా అభినందించవచ్చు కానీ ఆయన తెరాసను, సిఎం కేసీఆర్‌ను పొగిడేందుకే ఎక్కువ సమయం కేటాయించారు. ఆయన ప్రసంగం వింటే పదవీ విరమణ చేసిన తరువాత తెరాసలో చేరుతారేమోననే సందేహం కలుగుతోంది,” అని ఎద్దేవా చేశారు.


Related Post