కృష్ణయ్యకు కాంగ్రెస్‌ గాలి సోకిందా?

January 21, 2019


img

తెలంగాణ బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మొదటిసారి 2014 ఎన్నికలలో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచినప్పటి నుంచి రాజకీయాలు బాగా వంటబట్టించుకున్నారు. అందుకే 2018 ఎన్నికలలో ప్రజాకూటమి పంచన చేరి కాంగ్రెస్‌ టికెట్ దక్కించుకోగలిగారు కానీ విజయం సాధించలేకపోయారు. అయితే కాంగ్రెస్‌ నేతలతో కలిసి తిరిగినందువల్లనేమో ఆయనకు కూడా కాంగ్రెస్‌ పద్దతులు బాగా అలవాటైనట్లున్నాయి. ఆయన కూడా కోర్టులలో పిటిషన్లు వేయడం మొదలుపెట్టారు. 

పంచాయతీ ఎన్నికలలో బీసీలకు 34 శాతం ఉండే రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం 22 శాతానికి తగ్గించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే అన్ని వర్గాలకు కలిపి 50 శాతం లోపు రిజర్వేషన్లు మాత్రమే ఉండాలని సుప్రీంకోర్టు స్వయంగా గతంలో ఉత్తర్వులు ఇచ్చింది కనుక పంచాయతీ ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రకారమే నడుచుకొందని, కనుక బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని కోరలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.        



Related Post