విన్నపాలు వినవలె ప్రధానీజీ...

December 26, 2018


img
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత  కేసీఆర్‌ మొదటిసారిగా ఈరోజు సాయంత్రం డిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిరువురూ రాజకీయాల గురించి ఏమి మాట్లాడుకున్నారనే విషయం వారు చెపితే తప్ప ఎవరికీ తెలియదు కనుక దాని గురించి ఊహించడం అనవసరమే. కనుక వారి సమావేశం గురించి అధికారికంగా మీడియాకు తెలియజేసిన వివరాలనే చెప్పుకోవలసి ఉంటుంది. సిఎం కేసీఆర్‌ నేడు ప్రధాని నరేంద్రమోడీని కలిసినప్పుడు రాష్ట్రానికి సంబందించిన 16 పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒక వినతి పత్రం అందజేశారు. ఆ వివరాలు:

1. కరీంనగర్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) ఏర్పాటు చేయాలి.
2. హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలి.  
3. హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ (ఐఐఎస్‌ఈఆర్) 
4. సికిందరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించదలచిన నూతన సచివాలయం కోసం రక్షణశాఖ అధీనంలో ఉన్న బైసన్ పోలో మైదానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి.
5. వరంగల్‌లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు
6. ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను పునరుద్దరించాలి.
7. వరంగల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి కోసం రూ.1,000 కోట్లు నిధుల విడుదల చేయాలి.
8. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి.
9. నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మానుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్)-జహీరాబాద్ కోసం నిధుల విడుదల చేయాలి.
10. కొత్త జిల్లాల్లో 21 జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు
11. కృష్ణానదీ జలాల వివాదాల పరిష్కారానికి తక్షణం కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
12. ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన చేయాలి.
13. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల కోసం రూ.450 కోట్లు గ్రాంట్స్ నిధులు విడుదల చేయాలి.
14. రాష్ట్రంలో నత్తనడకలు నడుస్తున్న రైల్వే ప్రాజెక్టుల నిర్మాణ పనుల వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తిచేయాలి.
15. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రతిపాదన
16. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. 

Related Post