ఇదేమి పంచాయతీ?

December 25, 2018


img

తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఈ ఏడాది జూన్‌ 26న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దానిలో రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు తేల్చిన తరువాతనే పంచాయతీ ఎన్నికల నిర్వహించాలని ఆదేశించారు. 

అయితే పంచాయతీ ఎన్నికలపై జాప్యాన్ని సవాలు చేస్తూ కొన్ని నెలల క్రితం దాఖలైన మరో పిటిషనుపై విచారణ చేపట్టిన హైకోర్టు, మూడు నెలలోగా బీసీ జనాభా లెక్కలు పూర్తి చేసి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దాని ప్రకారం జనవరి 10వ తేదీలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతోంది.      

జూన్‌ 26న హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా కాంగ్రెస్ నేతలు హైకోర్టులో నిన్న ఒక పిటిషను వేశారు. బీసీ జనాభా లెక్కలు తేల్చిన తరువాతనే పంచాయతీ ఎన్నికల నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టి కోర్టుధిక్కారనేరానికి పాల్పడిందని వారు ఆరోపించారు. ఆ పిటిషనుపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంజాయిషీ కోరుతూ నోటీసు జారీ చేసింది.

హైకోర్టు తన రెండు ఉత్తర్వులలో బీసీ జనాభా లెక్కలు తేల్చిన తరువాతనే పంచాయతీ ఎన్నికల నిర్వహించాలని చాలా స్పష్టంగా పేర్కొంది. కానీ బీసీ జనాభా లెక్కలు తేల్చకుండా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సిద్దపడుతున్నందున, కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు భావించి పంచాయతీ ఎన్నికలను వాయిదా వేస్తుందా? లేక తన ఆదేశాల ప్రకారం జనవరి 10వ తేదీలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? చూడాలి.


Related Post