లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తాం: కమల్ హాసన్

December 22, 2018


img

ప్రముఖ తమిళ సినీనటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్‌హాసన్‌ వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేస్తుందని నేడు చెన్నైలో ప్రకటించారు. త్వరలోనే అభ్యర్ధుల ఎంపిక కోసం కమిటీని ఏర్పాటు చేస్తానని చెప్పారు. భావస్వారూప్యత కలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకొంటామని, కానీ పొత్తులు, కూటముల విషయం ఆలోచించేందుకు ఇంకా చాలా సమయం ఉందన్నారు. తమిళనాడు ‘డిఎన్ఏ’ను మార్చాలని ప్రయత్నిస్తున్న ఏ పార్టీతోనూ తాము పొత్తులు పెట్టుకోమని కమల్‌హాసన్‌ స్పష్టం చేశారు. 

 ఇక్కడ తమిళనాడు ‘డిఎన్ఏ’ అంటే ద్రవిడ సంస్కృతి, తమిళ బాష, సంస్కృతి సంప్రదాయాలుగా భావించవచ్చు. అంటే తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్న బిజెపిని దూరంగా ఉంచుతానని చెపుతున్నట్లు భావించవచ్చు. అలాగే తమిళనాడుపై బలవంతంగా హిందీ బాషను రుద్దాలని ప్రయత్నించే కాంగ్రెస్ పార్టీని కూడా సమానదూరంలో ఉంచుతానని చెప్పినట్లుగా భావించవచ్చు. తమిళనాడులో చిరకాలంగా అధికారాన్ని పంచుకొంటున్న అన్నాడిఎంకె, డిఎంకె పార్టీలకు  తన పార్టీ ప్రత్యామ్నాయంగా రూపొందించాలని కమల్‌హాసన్‌ఆలోచిస్తున్నట్లు అర్ధమవుతోంది.

ఆయన సహనటుడు రజనీకాంత్ కూడా రాజకీయపార్టీ స్థాపించేందుకు చాలా కాలంగా సన్నాహాలు చేసుకొంటున్నారు. కానీ ఇంతవరకు అధికారికంగా పార్టీని ప్రకటించలేదు. అయితే పార్టీ కోసం ఒక టీవి ఛానల్ ఏర్పాటు చేసుకోబోతున్నారు. రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి రాజకీయ సుస్థిరత ఏర్పరచి అభివృద్ధి పధంలో ముందుకు నడిపిద్దామనే మంచి ఆశయంతో ఇద్దరూ రంగంలో దిగుతున్నారు. కానీ కమల్, రజనీ ఇద్దరూ పేరున్న పెద్ద హీరోలే కనుక ఇద్దరు వేర్వేరు పార్టీలతో ఎన్నికల బరిలో దిగితే నాలుగు పార్టీల మద్య ఓట్లు చీలిపోయి తమిళనాడులో రాజకీయ అస్థిరత ఏర్పడినా ఆశ్చర్యం లేదు. 


Related Post