రిజర్వేషన్లపై అనుకొన్నదే జరిగింది

December 07, 2018


img

రాష్ట్రంలో ముస్లింలకు గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషనును సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదనలను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితులలో అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్ల కోటా 50 శాతం కంటే మించడానికి వీలులేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

50 శాతంకు మించి రిజర్వేషన్ల పెంపుకు అనుమతించబోమని సుప్రీంకోర్టు గతంలోనే తేల్చి చెప్పింది. కానీ తమిళనాడు 63 శాతం ఇస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు?కాకపోతే కేంద్రంతో పోరాడిసాధిస్తానని సిఎం కేసీఆర్‌ చెప్పారు. కానీ రిజర్వేషన్ల పెంపు విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టమయ్యింది. కనుక కధ మొదటికి వచ్చిందని భావించవచ్చు. ప్రస్తుతం పోలింగ్ జరుగుతోంది కనుక సిఎం కేసీఆర్‌ దీనిపై స్పందించడం సాధ్యం కాదు. పోలింగ్ హడావుడి ముగిసిన తరువాత ఆయన లేదా తెరాస నేతలు స్పందించవచ్చు.    



Related Post