కొడంగల్‌ కోటలో నేడు కేసీఆర్‌ సభ

December 04, 2018


img

సిఎం కేసీఆర్‌ నేడు కొడంగల్‌ నియోజకవర్గంలో కోస్గిలో ప్రజా ఆశీర్వాదసభ నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి కొడంగల్‌ కంచుకోటని అందరికీ తెలిసిందే. ఆయన పోటీ చేస్తున్న ఆ కంచుకోటలో నేడు సిఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతుండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రేవంత్‌రెడ్డిని ఈరోజు తెల్లవారు జామున అరెస్ట్ చేశారు. దీంతో కొడంగల్‌లో తీవ్ర ఉద్రిక్తవాతావరణం నెలకొని ఉంది. ఈ పరిస్థితులలో సిఎం కేసీఆర్‌ సభకు తెరాస నేతలు ఎంతవరకు జనసమీకరణ చేయగలరనేది చాలా ఆసక్తికరంగా మారింది. కొడంగల్‌ నుంచి పోటీ చేస్తున్న తెరాస అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి సిఎం కేసీఆర్‌ సభకు  ఏర్పాట్లు చేస్తున్నారు. 

సిఎం కేసీఆర్‌ ఇవాళ్ళ కోస్గి,ఆలంపూర్, గద్వాల్, మక్తల్, వికారాబాద్ లో బహిరంగసభలలో పాల్గొంటారు. శాసనసభనుంచి బహిష్కరింపబడటంతో వెలుగులోకి వచ్చిన కాంగ్రెస్‌ నేత సంపత్ కుమార్ x వికె.అబ్రహం (తెరాస) అలంపూర్ నుంచి, కాంగ్రెస్‌ ఫైర్ బ్రాండ్ మహిళా నేత డికె.అరుణ x బి. కృష్ణమోహన్ రెడ్డి (తెరాస) గద్వాల్ నుంచి, టిడిపి సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి x సి.రామ్మోహన్ రెడ్డి (తెరాస) మక్తల్ నుంచి, కాంగ్రెస్‌ అభ్యర్ధి జి.ప్రసాద్ కుమార్ x డాక్టర్ ఎం.ఆనంద్ (తెరాస) వికారాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. 



Related Post