రాష్ట్రంలో హాంగ్ అసెంబ్లీ : బిజెపి

November 29, 2018


img

బిజెపి సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవిఎల్ఎన్ రావు ఇవాళ్ళ మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదు కనుక హంగ్ అసెంబ్లీ ఏర్పడబోతోంది. అప్పుడు కర్ణాటకలోలాగే వివిదపార్టీలు పొత్తులు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌, జెడిఎస్ పార్టీల నేతలు ఒకరినొకరు ఏవిధంగా దూషించుకొన్నారో తెలంగాణలో కూడా ఇప్పుడు కాంగ్రెస్‌, తెరాస నేతలు ఒకరినొకరు దూషించుకొంటున్నారు. కానీ ఎన్నికల తరువాత అన్నీ కలిసిపోతాయి,” అని అన్నారు.

రాష్ట్రంలో తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయం బిజెపియేనని, మోడీ పాలన చూసి రాష్ట్ర ప్రజలందరూ తమ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని, డిసెంబరు 12వ తేదీన రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాబోతోందని ఆ పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు. మరోపక్క వారిని గెలిపించడానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా మొదలు అనేకమంది కేంద్రమంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తుంటే, రాష్ట్రంలో ఏ పార్టీకి మెజార్టీ లభించదని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవిఎల్ఎన్ రావు తేల్చి చెప్పేయడం విశేషం. ప్రజాకూటమి-75, తెరాసలు-108 సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని నమ్మకంగా చెపుతుంటే, ఏ పార్టీకి మెజార్టీ లభించదని చెప్పి జీవిఎల్ఎన్ రావు  బిజెపి ఓటమిని ముందే ప్రకటించేశారు!          


Related Post