రైతులకు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి

November 23, 2018


img

 మేడ్చల్ సభలో కాంగ్రెస్‌ నేత ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, “పత్తి, వారి రైతులారా మీరు డిసెంబరు 15వ తేదీ వరకు మీ పంటలను అమ్ముకోవద్దు. ఎందుకంటే, రాష్ట్రంలో రాబోయే కాంగ్రెస్ పార్టీ వాటికి గిట్టుబాటు ధరలు పెంచబోతోంది. వారికి క్వింటాలుకు రూ. 2,000, పత్తికి రూ.8,000 చెల్లించేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అలాగే బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకొన్నవారు డిసెంబరు 15వరకు చెల్లించవద్దని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రూ.2 లక్షల పంట రుణాలు ఒకేసారి మాఫీ చేయబోతున్నాము,” అని చెప్పారు. 

కేసీఆర్‌ పాలన గురించి మాట్లాడుతూ, “కేసీఆర్‌ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ప్రతీ ఇంటికీ ఓ ఉద్యోగం ఇస్తానన్నారు కానీ ఊరుకొక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. రైతుబంధు పధకం క్రింద కేసీఆర్‌ మనకు రూ.4,000 ఇస్తునమని గొప్పలు చెప్పుకొంటున్నారు. కానీ మరోపక్క రెండు లక్షల కోట్లు అప్పులు చేసి ఆ భారాన్ని మన నెత్తిమీద పెట్టారు. మన కష్టార్జితాన్నే మనకు ఇచ్చి గొప్పలు చెప్పుకొంటున్నాడు. కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు కనుక తెరాస పాలనకు చరమగీతం పాడి ప్రజాకూటమిని గెలిపించుకోవాలి,” అని అన్నారు. 



Related Post