అంబర్ పేట, వర్ధన్నపేట టిజేఎస్ అభ్యర్ధులు ఖరారు

November 19, 2018


img

మహాకూటమిలో పొత్తులలో భాగంగా తెలంగాణ జనసమితికి 8 సీట్లు మాత్రమే కేటాయించినప్పటికీ మొత్తం 14 స్థానాల నుంచి పోటీ చేయబోతున్నట్లు టిజేఎస్ ప్రకటించింది. 

మొదట మెదక్‌: జనార్దన్‌రెడ్డి, మల్కాజ్‌గిరి: కపిలవాయి దిలీప్‌కుమార్‌, సిద్దిపేట: భవానీరెడ్డి, దుబ్బాక: రాజ్‌కుమార్‌ పేర్లను ఖరారు చేసింది. ఆదివారం రాత్రి వరంగల్‌ తూర్పు: గాదె ఇన్నయ్య, మిర్యాలగూడ: విద్యాధర్ రెడ్డి, మహబూబ్‌నగర్‌: రాజేందర్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. 

ఈరోజు ఉదయం అంబర్ పేట: ఓయు విద్యార్ది నాయకుడు ఎన్.రమేశ్, వర్ధన్నపేట: పగిడిపాటి దేవయ్యల పేర్లను ఖరారు చేసింది. 

తాజాగా చెన్నూరు: దుర్గం నరేశ్, ఖానాపూర్: తట్ర భీం రావ్, స్టేషన్ ఘన్‌పూర్‌: చింతా స్వామి, ఆసిఫాబాద్: కె విజయ్, అశ్వారావు పేట: కె ప్రసాద్ లకు బి-ఫారంలు అందజేసినట్లు సమాచారం. దీంతో టిజేఎస్ మొత్తం 14 నియోజకవర్గాలలో పోటీ చేయడం ఖాయమైంది. 

టిడిపి, టిజేఎస్ లకు కేటాయించిన స్థానాలలో కాంగ్రెస్‌, అలాగే కాంగ్రెస్‌, టిడిపి పోటీ చేస్తున్న స్థానాలలో టిజేఎస్ అభ్యర్ధులకు బి-ఫారంలు కేటాయించడం గమనిస్తే వాటిమద్య   స్నేహపూర్వక పోటీ అనివార్యమని స్పష్టం అయ్యింది. కనుక ఆ మూడు పార్టీలు చర్చల పేరిట రెండున్నర నెలలు విలువైన సమయం వృధా చేసుకొన్నట్లేనని చెప్పవచ్చు. 


Related Post