కొడంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులు

November 19, 2018


img

కొండగల్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా రేవంత్‌రెడ్డి ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అనుచరులతో కలిసి ఊరేగింపుగా వెళ్ళి నామినేషన్ వేయాలనుకొన్నారు. కానీ రేవంత్‌రెడ్డి ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ఎట్టి పరిస్థితులలో ఊరేగింపు నిర్వహిస్తామని రేవంత్‌రెడ్డి అనుచరులు, ఎట్టి పరిస్థితులలో ఊరేగింపుకు అనుమతించబోమని పోలీసులు పట్టుదలగా ఉండటంతో కొడంగల్‌లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకపక్క ఊరేగింపు కోసం రేవంత్‌రెడ్డి అనుచరులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకోగా, వారిని అడ్డుకోవడానికి భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఆ ప్రాంతంలో సెక్షన్ 114 కూడా విధించారు. 

తెరాసతో సహా అన్ని పార్టీల నేతలు భారీ ఊరేగింపుగా వెళ్ళి తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి పోలీసులు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ ఒక్క రేవంత్‌రెడ్డి విషయంలోనే అనుమతి నిరాకరించడం దేనికో అర్ధం కాదు. నామినేషన్లు వేయడానికి ఇంకా కేవలం 3 గంటలు సమయం మాత్రమే మిగిలి ఉంది. కనుక రేవంత్‌రెడ్డిని ఆలోగా నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు తెర వెనుక ఏమైనా కుట్ర జరుగుతోందా? అని అనుమానించవలసి వస్తోంది.


Related Post