విజయశాంతి పోటీ చేస్తారా?

November 01, 2018


img

కాంగ్రెస్‌ స్టార్ కేంపెయినర్ విజయశాంతి తాను అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోనని నెలరోజుల క్రితమే ప్రకటించినప్పటికీ, ఆమె ఫలానా చోటు నుంచి పోటీ చేస్తారంటూ సోషల్ మీడియాలో నేటికీ నిత్యం పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆమె సిద్దిపేట జిల్లాలో దుబ్బాక నుంచి పోటీ చేయడానికి ఆమె అంగీకరించారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆమె శాసనసభ ఎన్నికలలో పోటీ చేయనని స్పష్టంగా చెప్పిన తరువాత కూడా మీడియాలో ఇటువంటి పుకార్లు లేదా వార్తలు ఎందుకుకు వస్తున్నాయి? ఎవరు సృష్టిస్తున్నారు? అని ఆలోచిస్తే బహుశః ఆ స్థానాల నుంచి టికెట్ ఆశించి దక్కదని గ్రహించిన కాంగ్రెస్‌ నేతలే తమకు టికెట్ రాకుండా చేసినవారిని ఇబ్బంది పెట్టడానికి ఆమె పేరును ఈవిధంగా తెరపైకి తెస్తుండవచ్చు లేదా విజయశాంతి తప్పకుండా పోటీ చేయాలని ఆశిస్తున్న ఆమె అభిమానులే ఈవిధంగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పెద్దలకు సూచిస్తుండవచ్చు.

అయితే ఇప్పటికే కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీ పార్టీ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసి డిల్లీకి పంపించేసింది. నేడో రేపో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల తొలి జాబితాను పేర్లు కూడా ప్రకటించబోతోంది కనుక ఇప్పుడు ఎవరికీ టికెట్ లభిస్తుంది? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? అని మీడియాలో వచ్చే ఊహాగానాలను నమ్మడం అనవసరం.


Related Post