వాళ్ళిద్దరూ కాంగ్రెస్‌లో చేరారు...మరి డిఎస్?

October 27, 2018


img

తెరాస బహిష్కృత నేతలు టి.నర్సారెడ్డి, రాములు నాయక్ శనివారం ఉదయం డిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారితోపాటు తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కూడా రాహుల్ గాంధీని కలిశారు. కానీ కాంగ్రెస్‌ కండువా కప్పుకోలేదు. తాను కాంగ్రెస్ పార్టీ చేరినట్లు మీడియాలో వస్తున్న వార్తలపై అయన స్పందిస్తూ, “రాజకీయాలలో నేను నిత్యం అనేకమంది రాజకీయ నాయకులను కలుస్తుంటాను. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీని కలిశాను తప్ప కాంగ్రెస్ పార్టీలో చేరలేదు,” అని డి.శ్రీనివాస్ అన్నారు.      

ఎమ్మెల్సీ పదవి ఇవ్వనందుకు కాంగ్రెస్ పార్టీతో మూడు దశాబ్ధాల అనుబంధాన్ని పుటుక్కున తెంచేసుకొని తెరాసలో చేరి రాజ్యసభ సీటు సంపాదించుకొన్న ఆయన దానిని వదులుకోవడం ఇష్టం లేకనే అధికారంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరలేదేమో?ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ హామీ ఇచ్చి ఉంటే, ఎలాగూ మరో వారం రోజులలో అభ్యర్ధుల జాబితాలో ఆయనపేరు కనబడుతుంది. టికెట్ ఖరారు అయిన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటిస్తారేమో?


Related Post