స్వామిజీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో?

October 27, 2018


img

ప్రభుత్వాలకు వాటిని నడుపుతున్న రాజకీయ పార్టీలకు మద్య సన్నటి గీత చెరిగిపోయిన కారణంగా వాటి మద్య తేడా లేకుండా పోయిందని చెప్పక తప్పదు. సిఎం కేసీఆర్‌-ప్రధాని నరేంద్ర మోడీల మద్య స్నేహం గురించి అందరికీ తెలిసిందే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశప్రధానితో సత్సంబందాలు కలిగి ఉండటం తప్పు కాదని, దానిని తెరాస-బిజెపిల స్నేహంగా భావించరాదని, తెరాస-బిజెపిలు రాజకీయంగా శత్రువులేనని రెండు పార్టీల నేతలు ఒకే గొంతుతో కోరస్ పాడుతుండటం వారి మద్య అవగాహనకు, ఐక్యతకు మరో చక్కటి నిదర్శనం.

ఈ నేపద్యంలో బిజెపిలో స్వామి పరిపూర్ణానంద చేరడంతో ఇప్పుడు ఆయన పరిస్థితి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. తనకు తెరాస సర్కార్ హైదరాబాద్‌ నగర బహిష్కరణ విధించినందుకు ఆగ్రహంతో దానిని గద్దె దించుతానని శపధం చేసి బిజెపిలో చేరారు. తెరాస-బిజెపిల మద్య పైకి కనబడని ఒక బలమైన బందం ఉందని ఆయనకు తెలియదనుకోలేము. ఆ సంగతి తెలిసీ ఆయన బిజెపిలో చేరారంటే అర్ధం ఆయన కూడా వాటి బంధాన్ని అంగీకరించి, దానికి కట్టుబడే ఉండాలని నిర్ణయించుకొన్నారనే భావించవలసి ఉంటుంది. కానీ ‘ఈసారి ఎన్నికలలో రాష్ట్రంలో కాషాయజెండా ఎగురుతుందని, అందుకోసం తను శాయశక్తులా కృషి చేస్తానని’ స్వామి పరిపూర్ణానంద చెపుతున్నారు. రాష్ట్ర బిజెపి నేతలందరూ కూడా ఇదే మాట చెపుతున్నారు. కనుక ఆయన మాటలను ‘లైట్’ గా తీసుకోవాలేమో? ఆ లెక్కన 'నాకు టికెట్లూ వద్దు... పదవులూ వద్దు' అంటున్న స్వామీజీ మాటలను నమ్మాలా వద్దా? ఇంతకీ స్వామీజీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు లభించవచ్చు.


Related Post