నిజామాబాద్ అర్బన్‌లో దూసుకుపోతున్న బిగాల గణేశ్ గుప్తా

October 25, 2018


img

ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో తెరాస అభ్యర్ధులు చాలా విన్నూత్న శైలిలో ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకొంటున్నారు. వారిలో నిజామాబాద్ అర్బన్‌ నుంచి పోటీ చేస్తున్న బిగాల గణేశ్ గుప్తా ఆధునిక టెక్నాలజీని తెలంగాణ సంస్కృతిని మేళవించి వినూత్న శైలిలో ఎన్నికల ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. తన నియోజకవర్గం పరిధిలో గల ప్రాంతాలకు సంబందించిన సమస్యలను, వాటి పరిష్కారానికి తెరాస ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ స్థానిక ఔత్సాహిక రచయితల చేత పాటలు రాయించి వాటిని రికార్డు చేయించి వినిపిస్తూ ప్రజలను ఆకట్టుకొంటున్నారు.

అలాగే ఈ నాలుగేళ్ళలో తెరాస హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, మళ్ళీ తెరాస అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తూ చక్కటి పాటలు రాయించి వినిపిస్తున్నారు. అలాగే ప్రధాన ప్రాంతాలలో ఎల్.ఈ.డి. స్క్రీన్లు ఏర్పాటు చేయించి, వాటి ద్వారా కూడా నిరంతరంగా ఎన్నికల ప్రచారం చేయిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకొంటున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా యువతకు చేరువయ్యేందుకు కృషి చేస్తున్నారు. బిగాల గణేశ్ గుప్తా ఎన్నికల ప్రచార శైలిని మిగిలిన తెరాస అభ్యర్ధులు కూడా అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. గణేశ్ గుప్తా జోరు చూస్తుంటే భారీ మెజార్టీతో గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి.


Related Post