సిఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు

October 25, 2018


img

సిఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారయింది. నవంబరు మొదటివారం నుంచి డిసెంబర్ 5వ తేదీన గడువు ముగిసేవరకు వరుసగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించబోతున్నారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌, ఎర్రవెల్లిలో తన ఫామ్ హౌస్, కరీంనగర్‌లోని తీగలగుట్టలపల్లిలో తన నివాసం కేంద్రాలుగా చేసుకొని ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. 

ప్రగతిభవన్‌ నుంచి హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలలోని 38 నియోజకవర్గాలలో, ఎర్రవెల్లిలో తన ఫామ్ హౌస్ నుంచి మేదక్, నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాలలోని 32 నియోజకవర్గాలలో, తీగలగుట్టలపల్లిలో తన నివాసం నుంచి వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాలోని 30 నియోజకవర్గాలకు హెలికాప్టర్‌లో వెళ్ళి ఎన్నికల ప్రచారం చేస్తారు. త్వరలోనే నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచార షెడ్యూల్ కూడా ప్రకటించనున్నారు.

సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన సాగే ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ ఆలీ, 15 మంది మంత్రులు, 14 మంది లోక్ సభ సభ్యులు, 5 మంది రాజ్య సభ సభ్యులు, ముగ్గురు పార్టీ విప్ లు పాల్గొంటారు.


Related Post