ఆరు జిల్లాలలో గులాబీ జెండా ఖాయం: కేసీఆర్‌

October 20, 2018


img

సిఎం కేసీఆర్‌ ఇటీవల తెరాస నేతలతో సమావేశమైనప్పుడు, ఈసారి ఎన్నికలలో పాత 10 జిల్లాలలో కనీసం 6 జిల్లాలలో తెరాస క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని అన్నారు. మిగిలిన 4 జిల్లాలలో కూడా గులాబీ జెండా ఎగురడం ఖాయమని అన్నారు. కనుక ఈసారి పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఒక పద్దతి ప్రకారం పనిచేసి తెరాస ఘనవిజయం సాదించేందుకు కృషి చేయాలని అన్నారు. 

ఈసారి ఎన్నికలలో తెరాస 110 స్థానాలు గెలుచుకొంటుందని సిఎం కేసీఆర్‌ పదేపదే చెపుతున్న సంగతి తెలిసిందే. కాగా పాత 10 జిల్లాలలో 6 జిల్లాలలో తెరాస క్లీన్ స్వీప్ చేస్తుందని కొత్త విషయం చెపుతున్నారు. ఆ లెక్కన కాంగ్రెస్‌ పార్టీలో హేమాహేమీల వంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డికె.అరుణ, రేవంత్‌రెడ్డి, షబ్బీర్ ఆలీ, జీవన్ రెడ్డి వంటి ముఖ్యనేతలు ఎవరూ కూడా గెలిచే అవకాశం లేదని చెపుతున్నట్లే భావించవచ్చు. కానీ ఇది సాధ్యమేనా? అనే సందేహం కలుగుతుంది. తెరాస నేతలలో, అభ్యర్ధులలో ఉత్సాహం నింపడానికి, తెరాస మాత్రమే గెలుస్తుందనే భావన ప్రజలలో వ్యాపింపజేయడానికే సిఎం కేసీఆర్‌ ఈవిధంగా చెపుతున్నారా లేక నిజంగానే ఈసారి ఎన్నికలలో తెరాస ప్రతిపక్ష పార్టీలను మట్టి కరిపించబోతోందా?అనే విషయం ఎన్నికల ఫలితాలు వస్తే గానీ తెలియదు.


Related Post