రెండు నెలల ప్రచారం తడిపిమోపెడు

October 08, 2018


img

సెప్టెంబర్ 6న తెలంగాణా శాసనసభ రద్దయితే డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ జరుగబోతోంది. ఈ మూడు నెలలలో మొదటి నెల రాజకీయ పార్టీలు ఒకదానినొకటి తిట్టుకోవడానికి సరిపోయింది కనుక అవి పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ ఇప్పటి నుంచి రెండు నెలలపాటు ఈ ఎన్నికల వేడిని కొనసాగించడం, దానిలో ప్రజలను మమేకం చేయడం, చాలా కష్టమే.

ఎన్నికలంటేనే డబ్బుతో పని. మున్సిపల్ ఎన్నికలలోనే ప్రచారం వగైరాలకు లక్షలు ఖర్చు పెట్టవలసివస్తోంది. ఇక తీవ్రమైన పోటీ ఉన్న అసెంబ్లీ ఎన్నికలంటే నీళ్ళలా డబ్బు ఖర్చు చేయక తప్పదు. అటువంటిది రెండు నెలలపాటు ఎన్నికల ప్రచారం చేయడం అంటే అభ్యర్ధులకు...ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధులకు ఆర్ధికంగా చాలా భారమే. తెలంగాణా శాసనసభ ఎన్నికలను నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు కలిపి నిర్వహించాలనే ఎన్నికల కమీషన్ నిర్ణయమే అభ్యర్ధులకు గుదిబండగా మారింది. కనుక ఈసారి ఎన్నికలలో అందరూ అభ్యర్ధులు చాలా భారీగానే డబ్బు ఖర్చు చేయకతప్పదు. తీరా అంత ఖర్చు చేసి రెండు నెలలు కాళ్లరిగేలా తిరిగి ఎన్నికల ప్రచారం చేసినా గెలుస్తామో లేదో అనే భయం కూడా ఉంటుంది. మరి రాజకీయ పార్టీలు ఈ రెండు నెలల సమయాన్ని ఏవిధంగా ఉపయోగించుకొని భారం తగ్గించుకొంటాయో చూడాలి. 


Related Post