మహాకూటమి మాపని తేలిక చేసింది: కేటీఆర్‌

October 06, 2018


img

మహాకూటమిపై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణా భవన్ లో టిఆర్ఎస్‌ అనుబంద విద్యార్ధిసంఘాల నేతలతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌, టిడిపి, టిజెఎస్, సిపిఐలు కలిసి ఏర్పాటు చేసుకొంటున్న మహాకూటమి పని మరింత తేలిక చేసింది. మనం వేర్వేరుగా ఆ నాలుగు పార్టీలతో పోరాడనవసరం లేకుండా అన్నిటినీ ఒకేసారి ఎదుర్కోవచ్చు. అలాగే మహాకూటమితో ప్రజల పని కూడా తేలికయ్యింది. వారు ఒకే ఓటుతో మహాకూటమిలోని నాలుగు పార్టీలను ఇంటికి సాగనంపవచ్చు. అంటే ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలన్న మాట. 

ఉద్యమ సమయంలో ఏసీ రూములలో పడుకొన్న ముసలి కాంగ్రెస్‌ నాయకులు అందరూ ఇప్పుడు కట్టకట్టుకొని వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ ఎన్నికలు తెలంగాణా ప్రజల ఆత్మగౌరవానికి సంబందించినవి. కనుక ప్రతీ విద్యార్ధి, యువకుడు ఆనాడు ఉద్యమాలలో ఏవిధంగా సైనికులలాగా పోరాడారో మళ్ళీ మన రాష్ట్రాన్ని పరాయిపాలనలోకి పోకుండా అడ్డుకొని మన ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం అదేవిధంగా పోరాడాలి,” అని చెప్పారు. 

మంత్రి కేటీఆర్‌ వేరే సందర్భంలో టిఆర్ఎస్‌ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నలుగురు బఫూన్లు కలిసి మహాకూటమి అనే సర్కార్ కంపెనీని మొదలుపెట్టారు. వారందరి కంటే పెద్ద బఫూన్ రాహుల్‌గాంధీ డిల్లీలో ఉన్నారు. ఆ పెద్ద బఫూన్ డైరెక్షన్లో ఇక్కడ బఫూన్లు నోటికి వచ్చినట్లు ఆడుతూ, వాగుతూ ప్రజలకు వినోదం పంచుతున్నారు. అయితే మీ అందరికీ రజనీకాంత్ డైలాగ్ తెలుసు కదా? సింహం సింగిల్ గా వస్తుంది కానీ ....” అంటూ మహాకూటమిని ఎద్దేవా చేశారు.


Related Post