రేవంత్ రెడ్డిని ఏమి ప్రశ్నిస్తారో?

October 03, 2018


img

తెలంగాణా కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని బుధవారం ఐటిగ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇంతకు ముందు విచారణకు హాజరైన సెబాస్టియన్, ఉదయ్ సింహాలను ఓటుకు నోటు కేసుకు సంబందించి ప్రశ్నించినట్లు సమాచారం. ఆ కేసును విచారించిన ఏసీబీ అధికారులు కూడా ఈరోజు ఐటివ కార్యాలయానికి రాబోతున్నట్లు సమాచారం. కనుక ఐటిా అధికారులు రేవంత్ రెడ్డిని కూడా ఓటుకు నోటు కేసుకు సంబందించిన ప్రశ్నలే అడిగే అవకాశం ఉందని భావించవచ్చు. 

గత బుధవారం రేవంత్ రెడ్డి ఇళ్ళపై ఐటిా అధికారులు దాడులు చేసినప్పుడు, ఆయనకు సంబందించిన అక్రమ ఆర్ధిక లావాదేవీలు, బినామీ కొనుగోళ్ళను కనుగొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిపై రేవంత్ రెడ్డి చాలా ధీటుగా బదులిచ్చారు. తాను, తన కుటుంబ సభ్యులు ఎటువంటి అవినీతి, అక్రమాలకు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదని, తన కుటుంబం ఆర్ధికంగా చాలా ఉన్నతస్థాయిలో ఉన్నందున తమకు విలువైన భూములు, ఆస్తులు, వ్యాపారాలు కలిగి ఉందని, వాటిని నేరాలుగా చూపుతూ తనపై ఐటిు దాడులు జరపడం రాజకీయ కక్ష సాధింపేనని రేవంత్ రెడ్డి వాదించారు. 

తన ఆస్తులపై ఆస్తులపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించుకొనేందుకు సిద్దమని, సిఎం కెసిఆర్‌...ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణకు సిద్దామెనా అని సవాలు విసిరారు. కనుక ఇవాళ్ళ ఐటిస విచారణలో రేవంత్ రెడ్డి ఆస్తులు, ఆర్ధిక లావాదేవీలపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి వారికీ సంతృప్తికరమైన సమాధానాలు చెపుతారని అందరూ భావిస్తుంటే, ఐటిం అధికారులు ఓటుకు నోటు కేసులో విచారిస్తారనే ఊహాగానాలు వినిపిస్తుండటం విశేషం. ఒకవేళ కనుక ఇవాళ్ళ ఐటిి అధికారులు రేవంత్ రెడ్డిని దేని గురించి ప్రశ్నిస్తారో....ఆ తరువాత ఏమి చేస్తారో? చూడాలి. ఒకవేళ వారు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ప్రశ్నించినట్లయితే ఆయనకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.


Related Post