రేవంత్ కేసులలో బాబుకి ఇబ్బంది తప్పదా?

September 29, 2018


img

రేవంత్ రెడ్డిపై ఐటి  దాడులు చేయడంపై ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. “ఐటిక అధికారులు పెద్ద తిమింగలాలను వదిలిపెట్టి రాజకీయ ఒత్తిళ్ళతో కాంగ్రెస్‌ నేతలపై దాడులు చేస్తున్నారు,” అని అన్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు-నరేంద్ర మోడీల మద్య సంబంధాలు చెడకుండా బలంగా ఉండి ఉంటే, బహుశః రేవంత్ రెడ్డిపై నేడు ఐటిా దాడులు జరిగి ఉండేవి కావేమో? ఒకవేళ జరిగినా ఆ సమస్య నుంచి రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు అవలీలగా బయటపడేసి ఉండేవారు. కానీ చంద్రబాబు నాయుడు బిజెపితో కేంద్రంతో తెగతెంపులు చేసుకొని రోజూ ప్రధాని మోడీపైనే నేరుగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు కనుక రేవంత్ రెడ్డికి ఎటువంటి సహాయమూ చేయలేని స్థితిలో ఉన్నారు.

రేవంత్ రెడ్డి ఇళ్ళపై దాడుల తరువాత ఐటి అధికారులు ఓటుకు నోటు కేసుకు సంబందించి వివరాలను తెలంగాణా ఏసిబి నుంచి సేకరించబోతున్నట్లు సమాచారం. అదే నిజమైతే ఆ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడుకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొక తప్పకపోవచ్చు. రేవంత్ రెడ్డిని కాపాడటం సంగతి అటుంచి ముందు తనను తాను కాపాడుకోవలసివస్తుంది. తెలంగాణాలో కాంగ్రెస్‌ నేతల పాత కేసులు తిరుగదోడి వారిని కట్టడి చేస్తున్నట్లే, ఏపీలో ఎన్నికలు దగ్గర పడినప్పుడు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడుని కట్టడి చేసేందుకు కేంద్రం ప్రయత్నించినా ఆశ్చర్యం లేదు. నటుడు శివాజీ చెపుతున్న ‘ఆపరేషన్ గరుడ’ ఇదేనేమో? కనుక చంద్రబాబు నాయుడు అప్రమత్తంగా ఉండటం మంచిది.


Related Post