రేవంత్ రెడ్డి అరెస్టుకు ముహూర్తం ఆదేనా?

September 29, 2018


img

తెలంగాణా కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్టుకు ముహూర్తం ఖరారయినట్లే ఉంది. రెండు రోజుల పాటు ఆయన ఇళ్ళు, బ్యాంక్ లాకర్లు వగైరా అన్ని తనికీలు చేసి, రోజంతా ప్రశ్నించిన ఐటిి అధికారులు అక్టోబర్ 3వ తేదీన హైదరాబాద్‌లోని ఐటిా కార్యాలయంలో తదుపరి విచారణకు హాజరుకావలసిందిగా కోరుతూ రేవంత్ రెడ్డికి నోటీస్ అందజేశారు. ఆరోజున లేదా మరో రెండు మూడు రోజులలోపు విచారణ పూర్తి చేసి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. 

రేవంత్ రెడ్డి డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమంగా నగదు బదలాయింపులు చేయడం, నగరంలో మరియు రాష్ట్రంలో పలు ప్రాంతాలలో కోట్లు విలువ చేసే భూములను తన బినామీల పేరిట నామ మాత్రపు ధరలకు కొని తరువాత వాటిని స్వాధీనం చేసుకోవడం వంటి అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఐటిప అధికారులు ఆరోపిస్తున్నారు. వాటన్నిటికీ బలమైన సాక్ష్యాధారాలు కూడా చూపుతున్నారు కనుక రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. 

అయితే ఇంతకంటే భారీ స్థాయిలో అక్రమాలు, అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులు కోర్టులను ఆశ్రయించి బెయిల్ సంపాదించుకొని స్వేచ్ఛగా తిరుగుతున్నారు కనుక రేవంత్ రెడ్డి కూడా కొన్ని రోజుల తరువాత అదేవిధంగా  ఈ కేసుల నుంచి బయటపడవచ్చు. కానీ ఆయనకు, కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన ఎన్నికల ముందు జైల్లో కూర్చోవలసివస్తే అదే ఇంతకంటే పెద్ద సమస్య అని చెప్పవచ్చు. మిత్రపక్షాలతో పొత్తులు, సీట్ల సర్ధుబాట్లు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఇక రేవంత్ రెడ్డి గురించి ఆలోచించే సమయం కూడా ఉండదు కనుక ఒకవేళ ఆయన అరెస్టయితే ఖండనలతో సరిపెట్టి ముందుకు సాగక తప్పదు. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ‘బాహుబలి’గా నిలిచి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కిస్తారనుకొన్న రేవంత్ రెడ్డి జైల్లో కూర్చోంటే అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బేనని చెప్పవచ్చు. 


Related Post