జైలుకు వెళతానేమో? రేవంత్ రెడ్డి

September 27, 2018


img

ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్‌ మరియు కోడంగల్ లో రేవంత్ రెడ్డి ఇళ్ళు మరికొన్ని చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో రేవంత్ రెడ్డి, ఆయన భార్య ఇద్దరూ ఇంట్లో లేరు. రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో కోస్గిలో తొలి ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు. ఆ సభలో మాట్లాడుతూ, “హైదరాబాద్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు నా ఇంటిపై దాడులు నిర్వహిస్తున్నారు. ఎన్నికలలో నన్ను ఎదుర్కొనే ధైర్యం లేకనే సిఎం కెసిఆర్‌ ఈ దాడుల కుట్ర చేస్తున్నారు. ఒకవేళ అంతా మంచిగా ఉంటే మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను లేకుంటే ఇదే నా చివరి ప్రసంగం అవుతుంది. ఈ కుట్రలో భాగంగా నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా పెట్టవచ్చు. జైల్లో పెట్టించినా నేను కొడంగల్ నుంచే పోటీ చేస్తాను. జైల్లో నుంచే నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తాను. అప్పుడు నన్ను భారీ మెజారిటీతో గెలిపించవలసిన బాధ్యత మీదే,” అని అన్నారు.

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటిప దాడులు టిఆర్ఎస్‌ కుట్రేనని కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలపై టిఆర్ఎస్‌ ఎంపీ కవిత నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డిపై జరుగుతున్న ఐటిి దాడులతో టిఆర్ఎస్‌కు ఎటువంటి సంబందమూ లేదు. ఈడీ కేసులు పెడితే దానికీ సిఎం కెసిఆర్‌ను నిందించడం తగదు,” అని అన్నారు. 

టిఆర్ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి చేసిన పాపాలే ఆయనకు ఈ పరిస్థితిని కల్పించాయి. దానికీ మా పార్టీనే నిందించడం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్ రెడ్డి ప్రవేశాన్ని, ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు కాంగ్రెస్‌ నేతలు రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటిస దాడులు జరిగినందుకు సంతోషిస్తున్నారంటే అర్ధం ఏమిటి? బహుశః వారిలో ఎవరో రేవంత్ రెడ్డిపై ఐటింకి ఫిర్యాదు చేశారేమో? 


Related Post