కోదండరామ్ మనసు మార్చుకొన్నారా...లేక

September 12, 2018


img

తెలంగాణా జనసమితి అధ్యక్షుడు బుధవారం ఉదయం గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన తరువాత తన పార్టీ కార్యాలయంలో ఒక్కరోజు నిరాహార దీక్షకు కూర్చోన్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మనం కేంద్రంతో కోట్లాడి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకొన్నది కెసిఆర్‌, ఆయన కుటుంబ సభ్యుల కోసం కాదు. అమరవీరుల బలిదానాలతో ఏర్పడిన ఈరాష్ట్రంలో కనీసం వారి కుటుంబాలకు కూడా కెసిఆర్‌ న్యాయం చేయలేకపోయారు. ఈ రాష్ట్రంలో ఆయన కుటుంబ సభ్యులు నలుగురూ తప్ప మరెవరూ ఫలాలు పొందలేకపోయారు. నియంతృత్వ పోకడలతో అప్రజాస్వామ్య పరిపాలన చేస్తూ అవినీతిలో మునిగితేలుతున్న సిఎం కెసిఆర్‌ను గద్దె దించవలసిన సమయం ఆసన్నమైంది. ఈ ప్రయత్నంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంది. కెసిఆర్‌ను గద్దె దించడానికి ఏ పార్టీతోనైనా మేము చేతులు కలపడానికి సిద్దంగా ఉన్నాము,” అని అన్నారు. 

నిజానికి ఆయనకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో బలమైన స్నేహసంబందాలున్నాయి కనుక కాంగ్రెస్ పార్టీలోనే చేరుతారని అందరూ భావించారు. కానీ వేరే పార్టీ పెట్టుకోవడంతో అది కాంగ్రెస్ పార్టీతో తప్పకుండా పొత్తులు పెట్టుకొంటుందని అందరూ భావించారు. కానీ నిన్న మొన్నటి వరకు కూడా తాము కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకోమని చెపుతూ వచ్చారు. ఇప్పుడు దానితో పొత్తులకు సిద్దమని చెప్పారు. అయితే అది ఆశ్చర్యకరమైన విషయం కాదనే చెప్పవచ్చు. 

ఇంతకాలం ఆ రెండు పార్టీలు వ్యూహాత్మకంగానే దూరంగా ఉండి, ఇప్పుడు సీట్ల సర్దుబాట్ల దశకు చేరుకొన్నందున పొత్తుల విషయం బహిర్గతం చేసి ఉండవచ్చు. లేదా కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గి పొత్తుకు సిద్దమై ఉండవచ్చు. 


Related Post