రాములమ్మ వద్దంటోందట

September 12, 2018


img

మాజీ ఎంపీ విజయశాంతి చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో సముచిత ప్రాధాన్యం లభించకపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది. అయితే అంతా గొప్ప ఇమేజ్ ఉన్న ఆమెను రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఎవరూ కూడా పట్టించుకోకపోవడం విశేషం.

తాజా సమాచారం ప్రకారం ఆమె త్వరలో మళ్ళీ రాజకీయాలలో చురుకుగా పాల్గొనబోతున్నారట. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారసభలలో పాల్గొనేందుకు డిల్లీ నుంకి కాంగ్రెస్‌ పెద్దలు వచ్చినప్పుడు ఆమె కూడా ఆ సభలలో పాల్గొనాలని భావిస్తున్నారుట. ఆమె తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్‌ పొత్తులు పెట్టుకోవడాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారుట. రాష్ట్ర ప్రజలకు ఆమోదం కానీ పొత్తుల వలన కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంది గనుక టిడిపితో పొత్తులపై పునరాలోచించుకోవాలని ఆమె కాంగ్రెస్‌ పెద్దలకు సూచించినట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఆమె టిడిపితో పొత్తులను వ్యతిరేకించడం నిజమైతే, కాంగ్రెస్‌ అభీష్టానికి విరుద్దంగా మాట్లాడటం ద్వారా తన రాజకీయ పునః ప్రవేశానికి తానే స్వయంగా అవరోధం కల్పించుకొన్నట్లే. ఒకపక్క రెండు పార్టీల మద్య సీట్లసర్దుబాట్లపై చర్చల స్థాయి వరకు కధ వచ్చేసినప్పుడు, ఇంతకాలం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న ఆమె పొత్తులపై అభ్యంతరాలు చెప్పినట్లయితే ఆమెనే పార్టీకి దూరంగా ఉంచవచ్చు. 


Related Post