నవంబరు నెలాఖరుకి కొత్త ప్రభుత్వం

September 06, 2018


img

తెలంగాణా భవన్ లో సిఎం కెసిఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, “ఎన్నికల ప్రక్రియ గురించి నేను కేంద్ర ఎన్నికల కమీషనర్ తో స్వయంగా మాట్లాడాను. మన ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిగారిని కూడా పంపించి పూర్తి వివరాలు సేకరించాను. ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన ఏర్పడిన తరువాతే ముందస్తు ఎన్నికలకు సిద్దపడ్డాను. అక్టోబర్ మొదటివారంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. వాటితో పాటే తెలంగాణా రాష్ట్రానికి కూడా నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆ తరువాత నవంబరు రెండవ వారంలోగా ఎన్నికలు పూర్తవుతాయి. ఎట్టి పరిస్థితులలో నవంబరు నెలాఖరుకి ఐదు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు కొలువు తీరుతాయి. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్‌ 100 సీట్లకు పైగా గెలుచుకోబోతోంది. అది మీరే చూస్తారు,” అని చెప్పారు.              



Related Post