అవి ముందస్తు సంకేతాలేనా?

September 04, 2018


img

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, సిఎం కెసిఆర్‌ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు కలిసి మంగళవారం మధ్యాహ్నం రాజ్ భవన్ వెళ్ళి గవర్నర్ నరసింహన్‌తో సమావేశం అయ్యారు. ముందస్తు ఎన్నికల గంటలు మ్రోగుత్తున్న నేపద్యంలో వారి సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకొంది. సిఎం కెసిఆర్‌ ఇప్పటికే డిల్లీ నుంచి తిరిగి రాగానే గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యి తన మనసులో ఆలోచనలను ఆయనతో పంచుకొన్నారు కనుక ఈరోజు మంత్రివర్గ సమావేశం,  శాసనసభ రద్దు, ఆ తరువాత సిఎం కెసిఆర్‌ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వ ఏర్పాటుకు సంబందించి రాజ్యాంగపరమైన అంశాలపై నలుగురు ఉన్నతాధికారులు గవర్నర్ నరసింహన్‌తో చర్చించే అవకాశం ఉందని చెప్పవచ్చు. సెప్టెంబర్ 6వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించి శాసనసభను రద్దు చేయాలని సిఎం కెసిఆర్‌ భావిస్తున్నట్లు మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలకు ఈ సమావేశం బలం చేకూరుస్తునట్లుంది. 



Related Post