అంత్యక్రియలపై కూడా వివాదమేనా?

August 08, 2018


img

డిఎంకె అధినేత అంత్యక్రియలు ఎక్కడ జరపాలనే దానిపై అధికార అన్నాడిఎంకె, ప్రతిపక్ష డిఎంకె పార్టీల మద్య తలెత్తిన వివాదానికి మద్రాస్ హైకోర్టు ముగింపు పలికింది. అయన అంత్యక్రియలు మెరీనా బీచ్ లోనే నిర్వహించుకోవచ్చునని డిఎంకె పార్టీకి అనుమతి ఇచ్చింది. 

చెన్నై మెరీనా బీచ్ లో అయన అంత్యక్రియలు జరుపాలని డిఎంకె నేతలు నిర్ణయించినప్పుడు తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. చెన్నైలోని గిండిలోని రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించదానికి సంసిద్దత వ్యక్తం చేసింది. కానీ అందుకు అంగీకరించని డిఎంకె పార్టీ నిన్న రాత్రి హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేసింది. మెరీనా బీచ్ లో అన్నాదురై సమాధికి సమీపంలోనే స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరింది. దానిపై నిన్న అర్దరాత్రి మద్రాస్ హైకోర్టు అత్యవసరంగా విచారణ చేపట్టింది. ఈరోజు ఉదయం మళ్ళీ 8 గంటలకు విచారణ చేపట్టి ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత మెరీనా బీచ్ లోనే కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించదానికి స్థలం కేటాయించవలసిందిగా ఆదేశించింది. ఈరోజు సాయంత్రం పలువురు ప్రముఖుల సమక్షంలో కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్ లో నిర్వహించబడతాయి. 



Related Post