రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల షెడ్యూల్

August 06, 2018


img

రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు సోమవారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించారు. నేటి నుంచి ఆగస్ట్ 8 మధ్యాహ్నం 12గంటల వరకు అభ్యర్ధులు నామినేషన్ వేయవచ్చు. ఆగస్ట్ 9వ తేదీన ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని వెంకయ్యనాయుడు ప్రకటించారు.

రాజ్యసభలో మొత్తం 245 సీట్లు ఉండగా వాటిలో ఎన్డీయే-73, యూపియే-50,ఇతర పార్టీలు-118, నామినేటడ్ సభ్యులు-4, ఒక స్థానం ఖాళీగా ఉంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు కనీసం 122 మంది సభ్యుల మద్దతు ఉండాలి. అన్నాడిఎంకె, తెరాస వంటి పార్టీల మద్దతు కూడగట్టుకొని తమ అభ్యర్ధినే ఈ పదవికి ఎంపిక చేసుకోవాలని భాజపా యోచిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రతిపక్షాలన్నీ కలిసి భాజపాను, మోడీని ఎదుర్కోవాలని భావిస్తునందున, అన్ని పార్టీల ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. అందుకోసం ఈ పదవిని త్యాగం చేయడానికి సిద్దపడుతోంది. కనుక కాంగ్రెస్‌, భాజపాలు రెండూ ఈ ఎన్నికలో విజయం సాధించి తమ సత్తా చాటుకోవాలని తహతహలాడుతున్నాయి. రెంటిలో ఏ కూటమి బలపరిచిన అభ్యర్ధి విజయం సాధిస్తారో మరో మూడు రోజులలోనే తేలిపోతుంది.



Related Post