కాంగ్రెస్‌-జెడిఎస్ కలహాల కాపురం

August 06, 2018


img

కర్ణాటకలో అధికారం నిలుపుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ, అప్పనంగా అందివచ్చిన అధికారాన్ని చేజిక్కించుకోవడానికి జెడిఎస్ పార్టీలు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు నుంచే వాటి మద్య తీవ్ర విభేదాలు మొదలయ్యి అవి నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఆగస్ట్ 10వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. రెండు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలలో వేర్వేరుగా పోటీ చేయాలని నిర్ణయించుకొన్నాయి. జెడిఎస్ అధినేత దేవగౌడ స్వయంగా ఈవిషయం పార్టీ నేతలకు తెలియజేశారు. కానీ జెడిఎస్-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేవని, రెండు పార్టీల సభ్యులు మంచి సయోధ్యతో కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. కానీ పంట రుణాలమాఫీతో సహా పలు అంశాలపై ఆ రెండు పార్టీలు తీవ్రంగా విభేధిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీచేయాలనుకోవడం ద్వారా వాటి మధ్య దూరం ఇంకా పెరిగిందని చాటుకొన్నట్లయింది. కనుక వాటి కలహాల కాపురం మూన్నాళ్ళ ముచ్చటగానే ముగుస్తుందేమో? 



Related Post