చిన్న జీయర్ ఎందుకు మాట్లాడటం లేదు?విహెచ్

July 17, 2018


img

 కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మంగళవారం పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ నరసింహన్, సిఎం కెసిఆర్, చిన్న జీయర్ స్వామిలపై తీవ్ర విమర్శలు చేశారు. 

గవర్నర్ గురించి మాట్లాడుతూ,” అయనకు రాష్ట్రంలో ఏమి జరుగుతోందో పట్టదు. ఎప్పుడూ గుళ్ళు గోపురాల చుట్టూ తిరగడానికే సరిపోతుంది. లక్షలాది మంది భక్తులు వచ్చే తిరుపతిలో పైన ఏమి కప్పుకోకుండానే ‘చూడ్రా భాయ్’ అన్నట్లు తిరుగుతుంటారు. కనీసం తన పదవిని, హోదాకు తగ్గట్లుగా హుందాగా ఉండాలని కూడా తెలియదు. ప్రతిపక్షాలు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోరు. రెండేళ్ళుగా ముఖ్యమంత్రి సచివాలయానికి రాకుండా ప్రగతిభవన్ లోనే కూర్చోంటున్నా ధైర్యంగా నిలదీసి అడగడు. ఇటువంటి గవర్నర్ దేశంలో మరెక్కడా లేరు...ఉండరు..ఉండబోరు,” అని అన్నారు. 

కెసిఆర్ పాలన గురించి మాట్లాడుతూ, “కెసిఆర్ పాలన చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటూ ఏమైనా ఉందా లేదా? అని అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలో మళ్ళీ రాజుల పాలన లేదా దొరల పాలనా మొదలైనట్లు కనిపిస్తోంది. ఎవరైనా గొంతెత్తి ప్రశ్నిస్తే వారిని పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తాడు. పాపం కోదండరాం ఏమి తప్పు చేశారని గృహనిర్బంధం చేస్తారు? అయన ఇంటి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేసారు? తెలంగాణా కోసం అయన కూడా కెసిఆర్ తో సమానంగా పోరాడలేదా? ఆయనకు మీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా?భాజపా ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, రాంచందర్ రావులు ప్రగతిభవన్ వెళ్లి ఓసారి సిఎం కెసిఆర్ ను కలిసొద్దామని బయలుదేరితే వారినీ గృహనిర్బంధం చేస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపిలు కలవడానికి వస్తే అపాయింట్ మెంట్ ఇవ్వరు. మా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వం పునరుద్దరించాలని హైకోర్టు చెప్పింది. కానీ హైకోర్టు మాటన్నా ఆయనకు లెక్క లేదు.”                         

“చిన్న జీయర్ స్వామిని కెసిఆర్ వెనకేసుకు వస్తాడు పరిపూర్ణానందను నగరం ఒదిలి బయటకు పొమ్మంటాడు. మరి చిన్న జీయర్ కూడా కాషాయం గుడ్డలు కట్టుకొని తిరిగే స్వామీజీయే కదా. కెసిఆర్ కు మంచిగ సలహాలు ఇస్తుంటాడు కదా. మరి పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేస్తే మరి ఆయనెందుకు మాట్లాడడు? కెసిఆర్ అంటే భయమా?” అని విమర్శలు గుప్పించారు.


Related Post