కిరణ్ చేరికపై టి-కాంగ్రెస్ నేతలేమంటారో?

July 13, 2018


img

రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి దానిని అడ్డుకునే ప్రయత్నాలు చేసినందున టి-కాంగ్రెస్ నేతలు అయనతో విభేదించేవారు. పొన్నం ప్రభాకర్ వంటివారు బహిరంగంగానే ఆయనపై తీవ్ర విమర్శలు చేసేవారు. ఆ తరువాత కధ అందరికీ తెలుసు. 

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు రాష్ట్రాలలో వేర్వేరుగా పనిచేస్తోంది కనుక ఏపి కాంగ్రెస్ పార్టీలో అయన చేరిక వలన తెలంగాణా నేతలకు పెద్దగా అభ్యంతరం, ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. కానీ ఏపిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అయన రాష్ట్ర విభజన గురించి మాట్లాడే అవకాశం ఉంది. అదే టి-కాంగ్రెస్ నేతలకు ఇబ్బందికరంగా మారవచ్చు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు దాని గురించి గట్టిగా మాట్లాడలేరు. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకొన్న కాంగ్రెస్ పార్టీలోనే మళ్ళీ చేరారు కనుక. ఏపిలో కిరణ్ కుమార్ రెడ్డి చేయబోయే రాజకీయాల ప్రభావం తెలంగాణా కాంగ్రెస్ పార్టీపై ఏమైనా ప్రభావం చూపుతుందా లేదా? చూపితే టి-కాంగ్రెస్ నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.



Related Post