కిరణ్ కుమార్ రెడ్డి గుర్తున్నారా?

June 27, 2018


img

సమైక్యరాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి గుర్తున్నారా? రాష్ట్ర విభజన తరువాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న అయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడిన పాత నేతలందరినీ తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా, మాజీ కేంద్రమంత్రి పళ్ళం రాజు, ఎంపి సుబ్బిరామిరెడ్డి ఆయనను కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించగా అయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 

అయన ఏపికి చెందినవారు కనుక ఏపి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, భాజపాలను ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక ఇబ్బందిపడుతున్న చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి నుంచి కూడా సరికొత్తసవాళ్ళు ఎదుర్కోవలసి ఉంటుంది. 

కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నప్పటికీ వచ్చే ఎన్నికలలో ఏపిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే చెప్పవచ్చు. కానీ అయన చేరికతో తెదేపా, వైకాపాల విజయావకాశాలను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీయగలదని చెప్పవచ్చు. కనుక చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా కిరణ్ కుమార్ రెడ్డిని ఎదుర్కోవడానికి తగిన వ్యూహాలు సిద్దం చేసుకోవడం మంచిది.


Related Post