ఎన్నికలకు ముందు ఏమిటీ పంచాయితీ?

June 21, 2018


img

జూలై నెలాఖరులోగా తెలంగాణాలో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్ర పంచాయితీ ఉద్యోగ, కార్మిక సంఘాలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు సిద్దం అవుతున్నాయి. పంచాయితీ ఉద్యోగ, కార్మిక జెఏసి ప్రతినిధులు బుధవారం పంచాయితీరాజ్ కమీషనర్ ను కలిసి సమ్మె నోటీసు ఇచ్చారు. జూలై 5లోగా తమ సమస్యలను పరిష్కరించాలాని లేకుంటే ఆ తరువాత ఏరోజునుంచైనా సమ్మె మొదలుపెడతామని నోటీస్ లో పేర్కొన్నారు. ఒకవేళ ఎన్నికలకు ముందు వారు సమ్మె చేస్తే దానివలన నష్టపోయేది అధికార తెరాసయే కనుక త్వరలోనే వారితో చర్చలు ప్రారంభించక తప్పదు.     



Related Post