తెగతెంపుల తరువాత తొలి సమావేశం అదే!

June 09, 2018


img

తెలంగాణాలో తెదేపాతో భాజపా తెగతెంపులు చేసుకోగా ఏపిలో భాజపాతో తెదేపా తెగతెంపులు చేసుకొంది. కారణాలు అందరికీ తెలుసు. అయితే తెలంగాణాలో తెదేపా-భాజపాలు దూరమైన తరువాత చాలా కాలం వరకు, ఏపిలో ఆ రెండు పార్టీలు స్నేహంగానే మెలిగాయి. అంతేకాదు...కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య స్నేహసంబంధాలు కూడా అద్భుతంగా కొనసాగడం విశేషం. కానీ ఎప్పుడైతే ఏపిలో భాజపాతో, కేంద్రంలో మోడీ సర్కార్ త్ తెదేపా తెగతెంపులు చేసుకుందో అప్పటి నుంచి తెదేపా-భాజపాల మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం మొదలైంది. నేటికీ అది ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రజలను ప్రధాని నరేంద్రమోడీ మోసం చేశారంటూ ఏపి సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక రాష్ట్ర స్థాయి తెదేపా-భాజపా నేతలు నిత్యం పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు ఈనెల 16న డిల్లీలో జరుగబోయే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఆ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీతో ముఖాముఖి సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఉపఎన్నికలలో భాజపాకు ఎదురుదెబ్బలు తగిలిన తరువాత మిత్రపక్షాలను మంచిచేసుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కనుక బాబు-మోడీ సమావేశం ఏ సరికొత్త రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. 


Related Post