కాంగ్రెస్ విభేదాలకు ఐఖ్యతకు ఒకటే కారణం!

June 09, 2018


img

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాలను తక్షణమే పునరుద్దరించాలని కోరేందుకు సిఎల్పి నేత జానారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈనెల 11న స్పీకర్ మధుసూధనాఛారిని కలువబోతున్నారు. ఒకవేళ ఆయన తక్షణం నిర్ణయం తీసుకోకపోతే, కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు హైకోర్టులో పిటిషన్ వేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆ తరువాత తెరాస సర్కార్ అప్రజాస్వామిక తీరును నిరసిస్తూ ఖమ్మం, ఆలంపూర్ లో 24 గంటలపాటు నిరాహార దీక్షలు నిర్వహించి, ఆ తరువాత అక్కడే బహిరంగ సభలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఆ తరువాత డిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి తెరాస సర్కార్ పై పిర్యాదు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను తెరాస సర్కార్ రద్దు చేసినప్పుడే టి-కాంగ్రెస్ ఇటువంటి ప్రయత్నాలు చేసి ఉంటే బాగుండేది కానీ జాప్యం చేయడం వలన పార్టీలో నేతల మధ్య అనైఖ్యత బయటపడింది. ఇప్పుడు ఈ సమస్యపై ఉదృతస్థాయిలో పోరాడటానికి సిద్దం అవుతోంది. 

కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వలను పునరుద్దరించకుండా జాప్యం చేయడం ద్వారా టి-కాంగ్రెస్ లో విభేధాలు బయటపడేలా చేయగలిగింది తెరాస. కానీ ఇప్పుడు ఆ జాప్యమే కాంగ్రెస్ నేతలు తమ విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా తెరాస సర్కార్ పై పోరాడేందుకు కూడా అవకాశం కల్పిస్తోంది. కనుక ఈ రాజకీయ చదరంగంలో చివరికి ఎవరు గెలుస్తారో చూడాలి.


Related Post