ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై డిఎంకె నేతలతో చర్చించడానికి చెన్నై వెళ్ళిన ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం ఆ పార్టీ అధినేత కుమార్తె కనిమోళితో చెన్నైలోని ఐటిసి చోళ హోటల్ లో సమావేశమయ్యారు. ఆమెతో దేశ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో కెసిఆర్ తో పాటు ఈటల రాజేందర్, కే కేశవా రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కానీ అవినీతి ఆరోపణలతో తీహార్ జైలుకు వెళ్ళివచ్చిన ఆమెతో దేశరాజకీయాలలో గుణాత్మకమైన మార్పు గురించి చర్చించడం విచిత్రంగానే ఉంది. ఆమెతో సమావేశం ముగిసిన తరువాత కొత్తగా పార్టీ పెట్టిన కమల్ హాసన్, పార్టీ పెట్టాలని యోచిస్తున్న రజనీకాంత్ లను కూడా కెసిఆర్ బృందం కలుస్తుందో లేదో ఇంకా తెలియవలసి ఉంది.