జనసేనకు ఊహించని షాక్ తగిలింది. ఈ నెల 21,22,23 తేదీలలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గుంటూరు, చిత్తూరు జిల్లాలలో కొన్ని కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంది. పార్టీ నేతలు అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ వాటిలో కొన్ని అసాంఘీక శక్తులు చొరబడి ‘తుని ఘటన’ వంటి బారీ విద్వంసానికి పాల్పడే ప్రమాదం ఉందని నిఘావర్గాలు హెచ్చరించడంతో ఆ కార్యక్రమాలను రద్దు చేసుకొంటున్నట్లు జనసేన ఒక బహిరంగ లేఖ ద్వారా తెలియజేసింది. అయితే ప్రత్యేకహోదా కోసం, ఏపి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా తాము చేస్తున్న పోరాటాలను ఆపబోమని ఆ లేఖలో స్పష్టం చేసింది.
జనసేన సభలు, ర్యాలీలు నిర్వహించుకొంటే ఇటువంటి సమస్య ఎదురవుతుందని నిఘావర్గాలు హెచ్చరించడం, వాటిని దృష్టిలో ఉంచుకొని జనసేన తన కార్యక్రమాలు రద్దు చేసుకోవడం రెండూ విచిత్రంగానే ఉన్నాయి. ప్రమాదం ఉందని కార్యక్రమాలు ఒకసారి రద్దు చేసుకొంది కనుక నిఘావర్గాలు మున్ముందు కూడా ఇలాగే హెచ్చరిస్తే అప్పుడు కూడా తన కార్యక్రమాలను ఇలాగే రద్దు చేసుకొంటుందా?అలాగైతే జనసేన ఏవిధంగా ప్రజలలోకి వెళ్ళగలదు?
రాజకీయ పార్టీలు బహిరంగ సభలు నిర్వహించుకోదలిస్తే వాటి వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించబోమని ఆ సభ నిర్వాహకులు పోలీసులకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆ సభకు కట్టుదిట్టమైన భద్రత కల్పించవలసిన బాధ్యత పోలీసులదే. కానీ సభ నిర్వహించుకొంటే ప్రమాదమని పోలీసులే వారిస్తే ఏమి చేయాలి? జనసేన ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి విడుదల చేసిన లేఖ ఇదే: