మానేరు ప్రాజెక్టులను కట్టింది ఎవరు?

April 18, 2018


img

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వ రద్దు చెల్లదని మంగళవారం హైకోర్టు తీర్పు చెప్పిన తరువాత కాంగ్రెస్ నేతలు తెరాస సర్కార్ పై విరుచుకుపడుతున్నారు.          

సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ బుధవారం గాంధీ భవన్ లో విలేఖరులతో మాట్లాడుతూ, “తెరాస సర్కార్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని హైకోర్టు నిర్ణయాన్ని ఆమోదిస్తే గౌరవంగా ఉంటుంది. కానీ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయాలనుకొంటే అక్కడ కూడా దానికి మొట్టికాయలు తప్పవు. ఈ ప్రభుత్వానికి కాగ్ అక్షింతలు వేసినా, హైకోర్టు మొట్టికాయలు వేస్తున్న దాని పద్దతిలో ఎటువంటి మార్పు రావడం లేదు. సిఎం కెసిఆర్ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తానని చెప్పి నాలుగేళ్ళవుతోంది. వారికి ఇళ్ళు కట్టలేదు కానీ తన కోసం 9 ఎకరాలలో రాజమహల్ వంటి ప్రగతి భవన్ నిర్మించుకొన్నారు,” అని ఎద్దేవా చేశారు.అన్నారు.     

కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ హయంలో కట్టిన మిడ్ మానేరు, లోవర్ మానేరు ప్రాజెక్టులను తామే కట్టినట్లు తెరాస నిసిగ్గుగా చెప్పుకొంటోంది. వాటిని ఎవరు కట్టారో ప్రజలందరికీ తెలుసు. తుమ్మినా దగ్గినా కాళేశ్వరం ప్రాజెక్టు భజన చేస్తూ తెరాస నేతలు కాళేశ్వర యాత్రలు చేస్తున్నారు. పెద్దపెద్దవాళ్ళను అక్కడకు తీసుకువెళ్ళి దానిని చూపించి వారిచేత తెరాస సర్కార్ పొగిడించుకొంటోంది,’ అని ఎద్దేవా చేశారు. 


Related Post