ఈసారి ప్లీనరీకి గులాబీ కూలి ఉంటుందా?

April 07, 2018


img

తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతీ ఏటా నిర్వహించే ప్లీనరీ సమావేశాలను ఈసారి ఏప్రిల్ 24 నుంచి 27వరకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించబోతున్నట్లు సమాచారం. 

మరొక 9-12 నెలలలో సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ఈసారి జరుగబోయే ప్లీనరీ సమావేశాలు తెరాసకు చాలా కీలకమైనవని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా మంత్రులు, తెరాస నేతలు అందరూ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు, తరచూ పాల్గొనే బహిరంగసభలలోనే తమ ప్రభుత్వం సాధిస్తున్న విజయాల గురించి గొప్పగా చెప్పుకొంటూ ప్రతిపక్షాలను..ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడుతుంటారు. కనుక ఎన్నికల ఏడాదిలో నిర్వహించబోతున్న ఈ ప్లీనరీ సభలలో వారు ఇంకా ధాటిగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడవచ్చు. అలాగే తమ హయంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పుకొని, ఇంకా కొత్త పధకాలను ప్రకటించే అవకాశం కూడా ఉంది.

ముఖ్యమంత్రి కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు కనుక ఈ ప్లీనరీ సమావేశాలలో దానికి సంబందించి కీలకమైన ప్రకటన చేయవచ్చు. 

ఇక ప్లీనరీ సమావేశాల నిర్వహణ కోసం తెరాస మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు గులాబీ కూలీ పేరిట నిధుల సమీకరణ చేస్తుంటారు. అధికారంలో ఉన్నవారు ఆవిధంగా పరిశ్రమలు, వ్యాపార సంస్థల నుంచి డబ్బు వసూలు చేయడం అనైతికమని ఎన్ని విమర్శలు వచ్చినా తెరాస పట్టించుకోలేదు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వారి చర్యలను సవాలు చేస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. కనుక ఈసారి గులాబీ కూలీ పేరుతో విరాళాలు సేకరిస్తారా లేదో చూడాలి.


Related Post