అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరూ తమతమ నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో, ఎమ్మెల్యేలందరికీ వారి నియోజకవర్గాలలో అన్ని అత్యాధునిక వసతులు, సౌకర్యాలు కలిగిన క్యాంప్ కార్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. వాటిలో మొదటగా నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ నిర్మాణం పూర్తవడంతో దాన్ని రాష్ట్ర ఐటి, పురపాలకశాఖా మంత్రి కేటిఆర్ గురువారం ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.