జగన్ సంచలన నిర్ణయం

March 31, 2018


img

ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని పార్లమెంటులో ఆందోళన చేస్తున్న వైకాపా ఎంపిలు, పార్లమెంటు సమావేశాలు ముగిసినట్లు ప్రకటించగానే అందరూ రాజీనామా చేసి, డిల్లీలో ఏపి భవన్ లో నిరవధిక నిరాహారదీక్షకు కూర్చొంటారని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి శనివారం గుంటూరు జిల్లాలో ప్రకటించారు. తెదేపా ఎంపిలు కూడా రాజీనామాలు చేసి మొత్తం 25మంది ఎంపిలు నిరాహార దీక్షకు కూర్చోన్నట్లయితే కేంద్రప్రభుత్వం తప్పనిసరిగా దిగివచ్చి ఏపికి ప్రత్యేకహోదా ఇస్తుందని జగన్ అన్నారు. అయితే తెదేపా ఎంపిలు తమతో కలిసి వచ్చినా రాకున్నా తమ ఎంపిలు రాజీనామాలు చేసి నిరాహార దీక్ష చేస్తారని జగన్ చెప్పారు. వారికి మద్దతుగా ఏపిలో యువత, విద్యార్ధులు కూడా ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు చేపట్టాలని జగన్ పిలుపునిచ్చారు. ఇక ఏపికి ప్రత్యేకహోదా సాధించేవరకు అందరూ కలిసికట్టుగా పోరాటాలు కొనసాగిద్దామని జగన్ పిలుపునిచ్చారు. 

పార్లమెంటు సమావేశాలు ఏప్రిల్ 6వ తేదీతో ముగియాలి. కానీ ఈలోపుగానే నిరవధికంగా వాయిదాపడినా పడవచ్చు. కనుక ఆ మర్క్షణం నుంచి ఏపిలో మళ్ళీ ప్రత్యేకహోదా కోసం దీక్షలు, ధర్నాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మాట మార్చి ఏపికి ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ తెదేపా ఎంపిలు రాజీనామాలు చేయబోరని ప్రకటించారు. కనుక ఇప్పుడు వైకాపా ప్రత్యేకహోదా అగ్గిని మళ్ళీ రాజేస్తుంటే, చంద్రబాబు నాయుడు దానిని ఏవిధంగా చల్లార్చుతారో...ఏవిధంగా ఈ సమస్య నుంచి బయటపడతారో చూడాలి.


Related Post