కెసిఆర్, చంద్రబాబు కలిసి పనిచేస్తారా?

March 29, 2018


img

కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ధర్డ్ ఫ్రంట్ కు మద్దతు పలికినవారిలో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా ఒకరు. అయన తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ వారిని భోజనానికి ఆహ్వానించారు. ఈసందర్భంగా వారిరువురు దేశరాజకీయలు, ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించినట్లు సమాచారం. 

కాంగ్రెస్ నేతృత్వంలో భాజపాయేతర పార్టీలను కూడగట్టేందుకు నిన్న డిల్లీలో శరత్ పవార్ నివాసంలో వివిధ పార్టీల నేతలతో ఒక సమావేశం జరిగింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా దానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కలిసి పనిచేయడంకంటే కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ధర్డ్ ఫ్రంట్ లో భాగస్వాములు అయితే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. కనుక ఎన్ని పార్టీలు కాంగ్రెస్ కు మొగ్గు చూపుతాయి? ఎన్ని పార్టీలు ధర్డ్ ఫ్రంట్ లో భాగస్వాములు అవుతాయో రానున్న రోజులలో తెలుస్తుంది. 

కేంద్రంపై రగిలిపోతున్న ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కూడా త్వరలోనే డిల్లీ వెళ్ళి భాజపాయేతర పార్టీల నేతలతో సమావేశమవబోతున్నారని తాజా సమాచారం. అయితే చంద్రబాబు, కెసిఆర్ రాజకీయంగా బద్దశత్రువులు కనుక తమ విభేదాలను పక్కను పెట్టి కలిసి పనిచేయడానికి ఇష్టపడతారా లేదా? అనే విషయం రానున్న రోజులలో తెలుస్తుంది. 



Related Post