ఆ ఆరోపణలను తెరాస తప్పించుకొంది..లక్కీ!

March 27, 2018


img

ఈరోజు కూడా లోక్ సభలో అన్నాడిఎంకె సభ్యుల ఆందోళన చేస్తున్నారనే సాకుతో మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సభలో చర్చకు అనుమతించకుండా స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభను రేపటికి వాయిదా వేశారు. 

అప్పుడు కాంగ్రెస్‌ ఎంపి మల్లికార్జున ఖర్గే మోడీ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ వాయిదా పడిన తరువాత అయన అన్నాడిఎంకె ఎంపిలను ఉద్దేశ్యించి, ‘మీరు భాజపాకు ఎంతకు అమ్ముడుపోయారు...మోడీ సర్కార్ మిమల్ని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతోంది?’ అని ప్రశ్నించడంతో కాసేపు అన్నాడిఎంకె, కాంగ్రెస్ సభ్యుల మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మద్యలో సోనియా గాంధీ కలుగజేసుకొని ఇరుపక్షాలకు నచ్చజెప్పడంతో వెనక్కు తగ్గారు. 

మొన్నటి వరకు తెరాస సభ్యులు కూడా రిజర్వేషన్ల అంశంపై సభలో ఆందోళన చేస్తుండేవారు. వారు మోడీ సర్కార్ ఆదేశాలమేరకు అవిశ్వాస తీర్మానాలు సభలో చర్చకు రాకుండా అడ్డుకోనేందుకే ఆందోళన చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించడంతో ఇవాళ్ళ నుంచి స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళకూడదని నిర్ణయించుకొన్నారు. లేకుంటే ఇవాళ్ళ అన్నాడిఎంకె ఎంపిలను ఉద్దేశ్యించి మల్లిఖార్జున ఖర్గే చేసిన అన్న మాటలు వారికీ వర్తించిఉండేవి. కనుక తెరాస సరైన సమయంలో సరైన నిర్ణయమే తీసుకొందని చెప్పవచ్చు.       



Related Post