బహిరంగంగానే మోడీకి పాదాభివందనం!

March 27, 2018


img

వైకాపా అధినేత జగన్, ఆ పార్టీ కార్యదర్శి విజయసాయి రెడ్డిలపై అక్రమాస్తుల కేసులలో సిబిఐ దాఖలు చేసిన 11 ఛార్జ్ షీట్స్ లో వారిరువురూ ఏ-1, ఏ-2 నిందితులుగా పేర్కొనబడ్డారు. ఆ కేసుల నుంచి విముక్తి పొందేందుకే విజయసాయి రెడ్డి ప్రధాని కార్యాలయంలో తిరుగుతున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. అయితే తాను ప్రజా ప్రతినిధిని కనుక ప్రధాని మోడీని ఎన్నిసార్లైన కలిసే హక్కు ఉందని తనకు ఉందని అయన వాదిస్తున్నారు. 

దీనిపై తెదేపా, వైకాపా నేతల మద్య వాగ్వాదాలు, ఆరోపణలు జోరుగా కొనసాగుతున్న సమయంలోనే విజయసాయి రెడ్డి మంగళవారం రాజ్యసభలో అందరూ చూస్తుండగానే ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు వెళ్ళి పాదాభివందనం చేశారు. మోడీ ఆయన భుజం తట్టి పంపారు. 

భాజపాకు, వైకాపాకు పొత్తులు లేవు. ఏవిధంగాను సంబంధాలు కూడా లేవు. పైగా మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా వైకాపాయే రోజూ వరుసగా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతోంది. మరి అటువంటప్పుడు విజయసాయి రెడ్డి పనిగట్టుకొని ప్రధాని దగ్గరకు వెళ్ళి పాదాభివందనం చేయడం ఆ రెండు పార్టీల మద్య రహస్య అవగాహన ఉందనే తెదేపా ఆరోపణలను దృవీకరిస్తున్నట్లయింది. రాజ్యసభలో అందరూ చూస్తుండగా విజయసాయి రెడ్డి మోడీకి పాదాభివందనం చేయడం ద్వారా భాజపా-వైకాపాల బంధాన్ని వారు ఉద్దేశ్యపూర్వకంగానే బహిర్గతం చేసినట్లు భావించవచ్చు. కనుక రానున్న రోజులలో ఆ రెండు పార్టీలు ఎన్నికల పొత్తులు పెట్టుకొనే అవకాశాలు ఉన్నాయని భావించవచ్చు. మరి దీనిపై తెదేపా ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.


Related Post