ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు..ఒక పగటికల!

March 13, 2018


img

కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించగానే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దానిపై భాజపా జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు స్పందిస్తూ, “రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక, నిరంకుశ పాలన సాగిస్తున్న కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయస్థాయిలో చక్రం తిప్పుదామని పగటి కలలు కంటున్నారు. గతంలో ధర్డ్ ఫ్రంట్ ప్రయోగాలు విఫలమయ్యాయి. పదవులు, అధికారం కోసం భాగస్వామి పార్టీల మద్య కీచులాటలు, తత్ఫలితంగా రాజకీయ అస్తిరత్వం, అవినీతి ఏర్పడతాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి పధంలో దూసుకుపోతోంది. భాజపాకు, ప్రధాని నరేంద్ర మోడీకి దేశంలో ప్రత్యామ్నాయం అవసరం లేదు. ఉండదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో ఇంకా వేగంగా కాంగ్రెస్ పతనమవుతుంది. దాని పతనానికి ఆయనే ‘స్పీడ్ అప్' చేస్తారు. తెరాసలో ఉన్నవారిలో సగం మంది కాంగ్రెస్ నేతలు..మిగిలినవారు ఆక్రమణదారులు, నక్సలైట్లే. తెలంగాణా అభివృద్ధిలో దూసుకుపోతోందని తెరాస మంత్రులు నేతలు గొప్పలు చెప్పుకొంటున్నారు. వారికి దమ్ముంటే తెలంగాణా అభివృద్ధి అంశంపై మాతో బహిరంగ చర్చకు రావాలి.” అని అన్నారు.

ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో మురళీధర్ రావు వ్యక్తం చేసిన అభిప్రాయం 100 శాతం నిజమేనని భావించవచ్చు. ధర్డ్ ఫ్రంట్ లో చేరేవారిలో ప్రధానమంత్రి పదవి చేపట్టాలనే కోరికతో చేరేవారే ఎక్కువ. కనుక ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన మొదటి రోజు నుంచే దానిలో ఆధిపత్యపోరు మొదలవుతుంది. 

పైగా ఉత్తరాది నేతలకు దక్షిణాది రాష్ట్రాల నేతల అంటే చాలా చులకన. బిహార్ ఎన్నికలకు ముందు 8 పార్టీలు కలిసి మహా కూటమిని ఏర్పాటు చేసుకొన్నాయి. కానీ ఎన్నికలు వచ్చేనాటికే అది కాస్త విచ్చినం అయిపోయింది.      నుక కెసిఆర్ నేతృత్వంలో వారందరూ పనిచేయడానికి ఇష్టపడకపోవచ్చు. ఒకవేళ కెసిఆర్ వారినందరినీ ఏకత్రాటిపైకి తీసుకువచ్చినా అవినీతిపరులు, అసమర్ధులు, పదవీలాలసతో తపించిపోతున్న నాయకులతో ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినట్లయితే ప్రజలు ఆ కూటమిని ఆదరించరు. కనుక ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ఎంత కష్టమో...కప్పల తక్కెడ వంటి దానిలో వివిధ పార్టీలను కలిపి ఉంచడం, ఆ కూటమిని ఎన్నికలలో గెలిపించుకోవడం...దానితో స్థిరమైన పాలనా అందించడం అన్నీ చాలా కష్టమైనపనులే. స్థిరమైన అవినీతి రహితమైన పాలన అందించడమే కష్టమైనప్పుడు ఇక జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పులు సాధించడం ఏవిధంగా సాధ్యం?


Related Post